ఆదివారం, 3 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 31 అక్టోబరు 2024 (16:32 IST)

టీటీడీ బోర్డు సభ్యులుగా నెల్లూరు నుంచి ఇద్దరు మహిళలు

Panabaka Lakshmi
Panabaka Lakshmi
నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు మహిళలు టీటీడీ బోర్డు సభ్యులుగా నియమితులయ్యారు. వారు కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, నెల్లూరు మాజీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి. ఎమ్మెల్యే వీ ప్రశాంతి రెడ్డి గతంలో వైఎస్సార్‌సీపీ హయాంలో ఢిల్లీ టీటీడీ అడ్వైజరీ బోర్డు చైర్మన్‌గా పనిచేశారు. ఆ తర్వాత టీడీపీ తరుపున కోవూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 
 
అలాగే గతంలో నెల్లూరు జిల్లాలోని కోట మండలానికి చెందిన పనబాక లక్ష్మి, కాంగ్రెస్ హయాంలో 1996, 1998, 2004లో మూడుసార్లు నెల్లూరు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. 
Vemireddy Prashanthi Reddy
Vemireddy Prashanthi Reddy
 
తాజాగా  టిటిడి ట్రస్ట్‌బోర్డు సభ్యురాలిగా ఎన్నికైన అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ "ముఖ్యమంత్రి ఎన్‌ చంద్రబాబు నాయుడు దీక్షతో టిటిడి బోర్డు సభ్యురాలిగా అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. టీటీడీ బోర్డు మెంబర్‌గా నన్ను నియమించడంలో చొరవ చూపిన ముఖ్యమంత్రి ఎన్‌ చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతూ తన బాధ్యతలను నిర్వర్తిస్తాను.." అని ఆమె హామీ ఇచ్చారు.