శనివారం, 14 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 25 అక్టోబరు 2024 (22:03 IST)

ఓ 10 రూపాయలు ఎక్కువైనా కొనండయ్యా... కుటుంబం కోసం మహిళా తల్లులు తాపత్రయం (video)

woman
మన భారతదేశంలో గ్రామీణ ప్రజల సంఖ్య దాదాపు 70 శాతం పైగానే వుంటుంది. ఈ 70 శాతంలో కుటుంబ పోషణ కోసం మహిళలు తమవంతు శ్రమిస్తుంటారు. వేకువ జామునే లేచి పొట్టకూటి కోసం తమకు తగిన వృత్తిని చేస్తూ జీవిస్తుంటారు. వీరిలో చాలామంది తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు రోడ్ సైడ్ ఎంచుకుంటుంటారు.
 
వచ్చేపోయే వాహనదారులకు అమ్ముకునేందుకు ప్రయత్నిస్తుంటారు. బహుశా చాలామంది ప్రజలు వారివద్ద కొనుగోలు చేస్తుంటారు కానీ కొద్దిమంది మాత్రం ధర తేడాగా వుందని వెళ్లిపోతుంటారు. ఐతే ఐదో పదో రూపాయలు ఎక్కువగా వుందని వారిని అలా వదిలేసి వెళ్లకండి... ధర కాస్త ఎక్కువనిపించినా వారి కష్టానికి ప్రతిఫలం అనుకుని కాస్త కొనేయండి.