సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 25 అక్టోబరు 2024 (20:25 IST)

15 రోజులకు ఒక్కసారైనా మహిళలు పైనాపిల్ తీసుకోవాలట

pineapple
పైనాపిల్ పండును మహిళలు 15 రోజులకు ఒక్కసారైనా తీసుకోవాలి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. జ్వరం, కామెర్ల వంటి అనారోగ్యాలలో ఉన్న వారికి పైనాపిల్ జ్యూస్‌ తాగించటం ఎంతో మంచిది. 
 
పైనాపిల్ పండు రసాన్ని ముఖానికి రాసుకుని మర్థన చేస్తే ముఖ చర్మం కోమలంగా, అందంగా మారుతుంది. పండులోని ఎంజైములు ముఖ చర్మంలో నశించిన కణాలను తొలగిస్తాయి. అంతే కాకుండా నల్లటి మచ్చలను తొలగిస్తుంది. 
 
పైనాపిల్‌లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల.. కంటి సమస్యలు దరిచేరకుండా చూస్తుంది. ఇందులో బీటా కెరోటిన్ కూడా సమృద్దిగా ఉంటుంది. కంటిచూపు బాగుండటానికి ఇది ఉపయోగపడుతుంది. 
 
పైనాపిల్ జీర్ణక్రియ సక్రమంగా పనిచేయడంలో సహాయపడుతుంది. ఇది మధుమేహం, హృదయసంబంధ వ్యాధులు, క్యాన్సర్‌ కారకాలైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది.