బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 నవంబరు 2024 (13:09 IST)

బాబా సిద్ధిఖీ తరహాలోనే సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తాం...

yogi adityanath
ఇటీవల మహారాష్ట్రకు చెందిన మాజీ మంత్రి, అజిత్ పవార్ వర్గానికి చెందిన బాబా సిద్ధిఖీని లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు చెందిన సభ్యులు ముంబైలో కాల్చి చంపేశారు. ఇదే తరహాలోనే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు హెచ్చరించారు. ఈ మేరకు ముంబై పోలీసులకు బెదిరింపు సందేశాలు వచ్చాయి. 'బాబా సిద్ధిఖీలాగా యూపీ సీఎంను చంపుతాం' అంటూ దుండుగులు అందులో హెచ్చరించారు. పైగా, ముఖ్యమంత్రి పదవికి యోగి ఆదిథ్యనాథ్ 10 రోజుల్లో రాజీనామా చేయాలంటూ శనివారం సాయంత్రం పోలీస్ కంట్రోల్ రూమ్కు ఈ మెసేజ్ వచ్చినట్లు తెలుస్తోంది. 
 
గత నెలలో మహారాష్ట్ర ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం నేత బాబా సిద్ధిఖీని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ సల్మాన్‌కు అత్యంత సన్నిహితుడుగా ఉన్నందుకే బాబాను చంపేశామని నిందితులు చెప్పారు. ఆ తర్వాత నుంచి పలువురికి లారెన్స్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయి. సిద్ధిఖీ కుమారుడు జీశాన్ సిద్ధిఖీ కూడా హిట్ లిస్ట్‌లో ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే అతడికి కూడా బెదిరింపు కాల్స్ వచ్చాయి.