ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 నవంబరు 2024 (12:57 IST)

హలోవీన్ వేడుకలు.. భారతీయులు కెనడాను నాశనం చేశారు..! (video)

Indian woman
Indian woman
అమెరికా హాలోవీన్ వేడుకల్లో మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్ కూడా కుటుంబ సమేతంగా పాల్గొని సందడి చేశారు. దీనికి సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. అలాగే తాజా హలోవిన్ వేడుకల్లో దొంగతనం చేసిందని చెబుతున్న ఓ మహిళ వీడియో హల్ చల్ చేస్తోంది. 
 
ఈ సంఘటన కెనడాలోని పొరుగున ఉన్న అనేక ఇళ్లల్లో క్యాండీలు, డెకరేషన్ లైట్లు దొంగిలిస్తున్నట్లున్న ఓ మహిళకు సంబంధించిన సీసీటీవి ఫుటేజ్ వీడియో తెరపైకి వచ్చింది. 
 
చూడటానికి ఆమె భారతీయ మహిళలా ఉన్నారని నెట్టింట రచ్చ జరుగుతోంది. దీంతో స్థానిక కెనడియన్ల నుంచి ఈ ఘటనపై జాత్యాహంకార వ్యాఖ్యలు మొదలుపెట్టేశారు. ఇందులో భాగంగా... "భారతీయులు కెనడాను నాశనం చేశారు..!" అని ఒకరు కామెంట్ చేస్తే... "మిఠాయిలు దొంగిలించాల్సిన పనికి పూనుకున్నారంటే చాలా భయంకరమైన పరిస్థితిలో ఉండి ఉండాలి!" అని ఇంకొకరు స్పందించారు.
 
దీంతో... అసలు విషయం, పూర్తి వివరాలు తెలుసుకోకుండా ఇలా ఒక మహిళ చేసిన పనిని పూర్తి దేశానికి అంటగట్టడం వారి పైత్యానికి, అవివేకానికి, అజ్ఞానానికి నిదర్శనం అంటూ మరికొంతమంది కామెంట్ పెడుతున్నారు.