గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 11 అక్టోబరు 2024 (09:21 IST)

లవ్ స్కామ్‌లో 65ఏళ్ల మహిళ.. రూ.1.3 కోట్లు కోల్పోయింది..

Woman
లవ్ స్కామ్‌లో 65ఏళ్ల భారతీయ మహిళ చిక్కుకుంది. ఓ యాప్ ద్వారా ఆమె రూ.1.3 కోట్లను కోల్పోయింది. ఇంకా ఆన్‌లైన్ యాప్‌లో పాల్ రూథర్‌ఫోర్డ్ అనే వ్యక్తితో పరిచయం ద్వారా ఈ మోసం మొదలైంది. ఫిలిప్పీన్స్‌లో సివిల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న తాను యుఎస్ పౌరుడినని ఆ వ్యక్తి ఆమెకు చెప్పాడు. అతను తన నిర్మాణ స్థలంలో చట్టపరమైన సమస్యల కోసం ఆమెను బిట్‌కాయిన్‌లలో డబ్బు అడిగాడు. ఆమెకు తిరిగి చెల్లిస్తానని వాగ్దానం చేశాడు.
 
స్కామర్ ఆమెకు 2 మిలియన్ డాలర్లతో కూడిన పార్శిల్‌ను పంపానని ఆమెకు వాగ్దానం చేశాడు. ఆమె ఆర్బీఐ, ఎన్పీసీఐ, భారతీయ కస్టమ్స్ వంటి వివిధ ప్రభుత్వ ఏజెన్సీల నుండి ఫోన్ కాల్స్ అటెండ్ చేసింది. 
 
ఇంకా ఆ పార్సిల్ స్వీకరించేందుకు రుసుము చెల్లించాలని చెప్పాడు. అతడి గైడెన్స్ ప్రకారం... నెల రోజుల కాలంలో రూ.1.3 కోట్లు చెల్లించింది. ఆ తర్వాత అతను ఫోన్ కాల్ అటెండ్ చేయకపోవడంతో దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై సైబర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.