గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 అక్టోబరు 2024 (22:51 IST)

మహిళ ఖాతాలోకి ఉన్నట్టుండి రూ.999 కోట్లు.. ఫ్రీజ్ జేసిన బ్యాంకు అధికారులు

Cash
ఓ మహిళ బ్యాంకు ఖాతాలోకి ఉన్నఫళంగా రూ.999 కోట్లు జమ అయ్యాయి. దీంతో షాక్ తిన్న బ్యాంకు అధికారులు ఆ బ్యాంకు ఖాతాను ఫ్రీజ్ చేశారు. ఈ ఘటన బెంగుళూరులో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బెంగుళూరుకు చెందిన ప్రభాకర్ అనే వ్యక్తి ఐటీ సిటీలోని ఐఐఎంబీలో ఓ కాఫీ షాపును నిర్వహిస్తున్నాడు. ఆయన భార్యకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బ్యాంకు ఖాతా ఉంది. కొన్ని రోజుల క్రితం ఆమె బ్యాంకు ఖాతాలో రూ.999 కోట్ల నగదు డిపాజిట్ అయినట్టు బ్యాంకు అధికారులు గుర్తించారు. 
 
అంత డబ్బు ఎలా వచ్చింది అని తెలుసుకునేలోపే... బ్యాంకు అధికారులు ఖాతాను ఫ్రీజ్ చేశారు. దీంతో వారి సొంత డబ్బు కూడా విత్ డ్రా చేసుకోలేని పరిస్థితి నెలకొంది. అయితే, ఆ డబ్బు ఎలా వచ్చిందో తమకు తెలియదని బాధిత మహిళ, ఆమె భర్త వాపోతున్నారు.