ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

ఏపీల సంక్షేమ పథకాల నగదు బదిలీపై ఈసీ ఆంక్షలు

cash
ఈ నెల 13వ తేదీన ఏపీ రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనుంది. అదే రోజున 25 లోక్‌సభ స్థానాలకు కూడా పోలింగ్ నిర్వహిస్తారు. అయితే, ఈ ఎన్నికల పోలింగ్‌కు ఓ రోజు ముందు సంక్షేమ పథకాల డబ్బును జమ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కానీ, ఎన్నికల సంఘం షాకిచ్చింది. పోలింగ్ తర్వాతే నగదు జమ చేయాలని ఆదేశించింది. 
 
ఇప్పటికే బటన్ నొక్కిన పథకాల డబ్బుల డబ్బు జమను ఎన్నికలయ్యే వరకు వాయిదా వేసిన విషయం తెల్సిందే. మే 13వ తేదీన పోలింగ్ ముగిసిన తర్వాత డబ్బు జమ చేసేలా మార్గదర్శకాలు జారీ చేస్తామని ఈసీ పేర్కొంది. కాగా, ఎలక్షన్ కోడ్ కంటే ముందే వివిధ పథకాల కోసం జగన్ బటన్ నొక్కారు. అయితే, ఎన్నికలు ముగిసిన తర్వాత లబ్దిదారులకు నగదు జమ చేయాలని ఈసీ ఆదేశించింది. 

దక్షిణాది ప్రజలు ఆఫ్రికన్లలా కనిపిస్తారు : శామ్ పిట్రోడా 
 
కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా వివాస్పద వ్యాఖ్యలు చేశారు. జాతీయ ఐక్యత గురించి వివరించే క్రమంలే ఆయన ఉపయోగించిన భాష పెను రాజకీయ దుమారానికి తెరతీసింది. పిట్రోడా వ్యాఖ్యలపై బీజేపే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తుంది. 
 
ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో దేశంలోని తూర్పు ప్రాంత ప్రజలు (ఈశాన్య) చైనీయుల్లా కనిపిస్తారు. దక్షిణ ప్రాంత ప్రజలు ఆఫ్రికన్లలా కనిపిస్తారు అని చెప్పారు. ఉత్తరాదివారు మాత్రం తెల్ల జాతీయుల్లా కనిపిస్తారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు పెను దుమారానికి దారితీశాయ. బీజేపీ నేతలు శామ్ పిట్రోడాపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. 
 
మణిపూర్ ముఖ్యమంత్రి న్.బీరెన్ సింగ్, అస్సోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మత పాటు బీజేపీ నేతలు తప్పుబట్టారు. శామ్ భాయ్.. నేను దేశఁలోని ఈశాన్య ప్రాంతానికి చెందిన వాడిని. నేను భారతీయుడిలా కనిపిస్తా. మేం చూసేందుకు భిన్నంగా కనిపించొచ్చు. కానీ, మేమంతా ఒక్కటే. దేశం గురించి కనీసం కొంచమైనా అర్థం చేసుకో అంటూ హిమంత బిశ్వ శర్మ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. 
 
మరోవైపు, బాలీవుడ్ నటి, బీజేపీ మహిళా నేత కంగనా రనౌత్ కూడా శామ్ పిట్రోడాపై విరుచుకుపడ్డారు. "రాహుల్ గాంధీ మెంటర్ పిట్రోడా. భారతీయుల గురించి ఆయన చేసి జాతి విద్వేష, విభజన వ్యాఖ్యలు వినండి. వారి సిద్ధాంతమే దేశాన్ని విభజించి పాలించడం. సాటి భారతీయులను చైనీయులుగాను, ఆఫ్రికన్లుగా అభివర్ణించడం దారుణం. ఇందుకు కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నేతలు సిగ్గుపడాలి అటూ ఆమె ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు.