శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 17 అక్టోబరు 2024 (09:33 IST)

నిఘా సమాచారమే కానీ గట్టి ఆధారాల్లేవ్.. నిజ్జార్ హత్య కేసులో నీళ్లు నమిలిన ట్రూడో

Justin Trudeau
ఖలీస్థానీ ఉగ్రవాది హార్దీప్ సింగ్ నిజ్జార్ హత్య కేసులో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని తాను ఆరోపణలు చేశానని, ఈ కేసులో నిఘా సమాచారమే తప్ప... గట్టి ఆధారాల్లేవని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పష్టం చేశారు. తాను ఆరోపణలు చేసే సమయంలో తన వద్ద ఖచ్చితమైన ఆధారాలు గానీ లేదా సమాచారం లేదని అంగీకరించారు. 
 
"కెనడా వ్యవహారాల్లో విదేశీ జోక్యం" అనే అంశంపై నిర్వహించిన విచారణ కమిషన్ ముందు హాజరైన ఆయన మాట్లాడుతూ, భారత్‌పై మోపిన ఆరోపణలపై ప్రస్తావించారు. ప్రాథమిక సమాచారం మేరకే నిజ్జార్ హత్య కేసుపై మాట్లాడాను. భారత్ ఏజెంట్ల పాత్ర ఉన్నట్టుగా నిరూపించే స్పష్టమైన సాక్ష్యమేదీ లేదు. ఇదే విషయమై సహకరించాలని భారత్‌ను కెనడా కోరింది. వాళ్లు ఆధారాలు కావాలని కోరారు. అయితే, ఆ సమయంలో కెనడా వద్ద నిఘా వర్గాల సమాచారం మాత్రమే ఉంది" అని కెనడా ప్రధాని బదులిచ్చారు. 
 
ఈ విషయాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి కూడా జీ20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా తీసుకెళ్లినట్టు చెప్పారు. అయితే, కెనడాలో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వారిని అరెస్టు చేయాలని సూచించారన్నారు. ఏదేమైనా జి20 నుంచి తమ దేశానికి వచ్చేకే తెలిసిందని. కెనడాను విమర్శించే ధోరణిని భారత్ అవలభిస్తోందని స్పష్టమైందని జస్టిన్ ట్రూడో తెలిపారు.