శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 24 నవంబరు 2024 (17:39 IST)

జగన్మోహన్ రెడ్డి హౌజ్‌కు వస్తే మీ తాట తీస్తారని భయమా?: దువ్వాడ శ్రీనివాస్ (video)

Duvvada Srinivas
Duvvada Srinivas
వైకాపా నేత దువ్వాడ శ్రీనివాస్ మరోసారి వార్తల్లో నిలిచారు. శాసనమండలిలో మద్యంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే తనపై కేసులు నమోదు చేశారని ఆరోపించారు. తమ ఇంటి వద్దకు వచ్చి చంపేస్తామని జనసేన నాయకులు బెదిరించారని.. వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే తనపై ఎన్ని కేసులు పెద్దినా అదిరేది, బెదిరేది లేదని దువ్వాడ శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. 
 
అలాగే వైకాపా అధినేత జగన్‌కు మద్దతుగా దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడారు. వైకాపా చీఫ్ జగన్‌కి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి హౌజ్‌కు వస్తే మీ తాట తీస్తారని భయమా అంటూ అడిగారు. ప్రశ్నిస్తారని భయమా? అసెంబ్లీ ప్రతిపక్షాన్ని  ఎందుకు అడుగుతున్నామంటే.. విపక్షాలకంటూ కొంత సమయం వస్తుంది. 
 
ప్రజల సమస్యలపై మాట్లాడేందుకు అవకాశం లభిస్తుంది. జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో బడ్జెట్‌పై మాట్లాడాలంటే గంటా 40 నిమిషాలు పట్టింది. 
 
అలాంటిది విపక్ష హోదా ఇస్తే ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు సులువుగా సమయం లభిస్తుందని దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.