శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 24 నవంబరు 2024 (12:24 IST)

ఆర్టీసీ బస్సు.. చివరి సీటులో యువకుడు ఆత్మహత్య.. కారణం ఏంటి?

suicide
ఆర్టీసీ బస్సులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఓ యువకుడు. ఈ ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరుపతి ఆర్టీసీ బస్సు ఏర్పేడు సమీపంలోకి వచ్చినప్పుడు ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే రేణిగుంట వద్ద కండక్టర్ దీన్ని గుర్తించాడు. బస్సులో చివరి సీటు వద్ద హ్యాంగర్‌కు యువకుడు ఉరి వేసుకుని ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఇది గమనించి కండక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ సమయంలో బస్సులో ముగ్గురు ప్రయాణీకులు మాత్రమే ఉన్నారు. కండక్టర్ ఫిర్యాదు మేరకు రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ యువకుడి ఆత్మహత్యకు గల కారణాలేంటనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.