సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 నవంబరు 2024 (15:42 IST)

సీఎం చంద్రబాబు ఆదేశంతో తిరుపతిలో ఆ వంతెన పేరు మళ్ళీ మారింది...

garuda flyover
తిరుపతిలో గత 2018లో టీడీపీ ప్రభుత్వ హయాంలో వంతెన నిర్మించి దానికి గరుడ వారధి అనే పేరు పెట్టారు. అయితే, గత వైకాపా పాలకులు శ్రీనివాస సేతు వారధిగా పేరు మార్చారు. ఇపుడు ఏపీలోని టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఇపుడు మళ్లీ ఈ వంతెన పేరు మార్చారు. తిరిగి గురుడ వారధిగానే నామకరణం చేశారు. 
 
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాలకు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్, జగనన్న పేరుతో పథకాల పేర్లు మార్పు చేశారు. దీంతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా జగనన్న పేరుతో ఉన్న పథకాలన్నింటికీ పేర్లు మార్పు చేయడం జరిగింది.
 
తాజాగా మరో ప్రాజెక్టుకు జగన్ హయాంలో పెట్టిన పేరును ఈ సర్కార్ తొలగించింది. తిరుపతిలోని శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ పేరును ఆఫ్కాన్ సంస్థ మార్పు చేసింది. శ్రీనివాస సేతు స్థానంలో గరుడ వారధిగా పేరును అధికారులు మార్పు చేశారు. 2018లో గరుడ వారధి పేరుతోనే ప్రాజెక్టును అప్పటి సీఎం చంద్రబాబు ప్రారంభించారు.
 
అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం గరుడ వారధి స్థానంలో శ్రీనివాససేతుగా పేరును మార్చింది. తాజాగా సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికారులు తిరిగి గడుడ వారధిగా పేరును మార్చేశారు. నగర ప్రజల నుండి పెద్ద ఎత్తున వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో పాత పేరును కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని సమాచారం.