సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 18 నవంబరు 2024 (14:03 IST)

పాఠశాలకు ఆలస్యంగా వచ్చారని.. 18మంది విద్యార్థినులకు హెయిర్ కట్ (video)

Hair Cut
Hair Cut
మొన్నటికి మొన్న హెయిర్ కట్ సరిగా చేయించుకోలేదని ఓ ప్రొఫెసర్ విద్యార్థికి ఏకంగా గుండు కొట్టించిన సంఘ‌ట‌న మరువక ముందే ఇలాంటి ఘ‌ట‌నే విశాఖపట్నం జిల్లాలో వెలుగు చూసింది. పాఠ‌శాల‌కు ఆల‌స్యంగా వ‌చ్చార‌నే నెపంతో హాస్టల్ అధికారి ఓవరాక్షన్ చేసింది. 
 
18 మంది విద్యార్థినుల జుట్టు క‌త్తిరించింది హాస్ట‌ల్ అధికారి. జి.మాడుగల మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠ‌శాల‌లో ఈ అమానుషం చ‌ర్య చోటుచేసుకుంది. 
 
పాఠశాలకు ఆలస్యంగా వచ్చారని హాస్టల్ ఇంచార్జ్ ప్రసన్న కుమారి ఏకంగా 18 మంది విద్యార్థినుల జట్టు కత్తిరించింది. అయితే, ఈ విష‌యం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఇంతటి దారుణానికి పాల్ప‌డిన ఇంచార్జిని విధుల నుంచి వెంటనే తప్పించాలంటూ వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.