గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 18 నవంబరు 2024 (13:01 IST)

మంగళగిరిలో లేడీ అగోరి హల్చల్‌- పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు రోడ్డుపైనే..? (Video)

Lady Aghori
Lady Aghori
మంగళగిరి పట్టణంలో లేడీ అగోరి హల్చల్‌ చేసింది. ఆటోనగర్‌‌లోని ఆల్‌ స్టార్‌ కార్‌ వాష్‌‌కు ఆమె కారు సర్వీసింగ్‌ చేసుకోవడానికి వచ్చింది. సర్వీస్‌ అయిపోయి వెళ్లే సమయంలో ఒక విలేకరి ఫోటోలు తీస్తుండగా, అతనిపై స్టీల్‌ రాడుతో దాడి చేసింది. 
 
అక్కడ కారు వదిలేసి నడుచుకుంటూ బైపాస్‌ రోడ్‌‌లోని జనసేన రాష్ట్ర కార్యాలయం వద్ద హైవే రోడ్డుపై బైఠాయించి… డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను కలవాలని డిమాండ్‌ చేసింది. 
 
పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. పట్టణ సిఐ వినోద్‌ కుమార్‌‌పై దాడికి అఘోరి ప్రయత్నించింది. ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.