బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 నవంబరు 2024 (18:34 IST)

ప్రయాణికురాలి బ్యాగు నుంచి బంగారం చోరీ చేసిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ (Video)

gold
ఆర్టీసీ బస్ డ్రైవర్ చేతివాటాన్ని ప్రదర్శించారు. తన వెనుక ఓ ప్రయాణికురాలు ఉంచిన బ్యాగులో ఉన్న బంగారాన్ని చోరీచేశాడు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ బ్యాగులో బంగారాన్ని దొంగతనం చేస్తుండగా ఓ ప్రయాణికుడు తన మొబైల్ ఫోనులో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో ఈ చోరీ ఘటన వైరల్ అయింది. దీంతో ఆ డ్రైవర్ ఉద్యోగం కోల్పోయాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా ఆర్టీసీ బస్సులో జరిగింది. 
 
ఆర్టీసీ బస్సులో అద్దె బస్సుకు డ్రైవరుగా పనిచేస్తూ ఈ చోరీకి పాల్పడినట్టు ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ వీడియో తమ దృష్టికి రావడంతో ఆ డ్రైవర్‌ను వెంటనే విధుల నుంచి తొలగించినట్టు తెలిపారు. 
 
సాధారణంగా ఎవరైనా ప్రయాణికుడు బస్సులో తమ లగేజీ మరిచిపోతే దానిని బస్సు డిపోలో అప్పగిస్తారు. వారు ప్రయాణికుడి వివరాలు సేకరించి ఆ లగేజీని చేరవేసేందుకు ప్రయత్నిస్తారు. అయితే, ఈ బస్సు డ్రైవర్ మాత్రం ఆ పని చేయకుండా తన వెనుక పెట్టిన బ్యాగులోని బంగారాన్ని చోరీ చేశాడు. 
 
అయితే, ఓ ప్రయాణికుడు ఈ చోరీ ఘటన మొత్తాన్ని వీడియో తీశాడు. దీంతో ఆ డ్రైవర్ తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. బ్యాగులో నుంచి బంగారం కిందపడింది, దాన్ని బ్యాగులో పెట్టే ప్రయత్నం చేశానని బుకాయించాడు. అయితే, ప్రయాణికులంతా గట్టిగా నిలదీయడంతో చేసిన నేరాన్ని అంగీకరించాడు.