గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 12 నవంబరు 2024 (22:25 IST)

అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌తో పోటీ పడితే మజా ఏముంటుంది : సీఎం రేవంత్ రెడ్డి

revanth reddy
హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విషయంలో పొరుగున ఉండే ఆంధ్రప్రదేశ్ లేదా కర్నాటక లేదా మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలతో పోటీపడితే మజా ఏముంటుందని, న్యూయార్క్ సిటీ, సియోల్ వంటి మహానగరాలతో పోటీపడాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ, హైదరాబాద్ ప్రపంచ నగరాలతో పోటీ పడేలా ముందుకు సాగుతుందన్నారు. 
 
బెంగుళూరు, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై నగరాలతో పోటీ పడితే మజా ఉండనే ఉండదన్నారు. ప్రస్తుతం ప్రపంచ కుగ్రామంగా మారిపోయిందని, కాబట్టి ప్రపంచ నగరాలతో పోటీ పడాల్సిఉందని అభిప్రాయపడ్డారు. తెలంగాణాలో ఆదానీ పెట్టుబడులు పెడితే అభివృద్ధి చజేస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. ఇతరుల చేతుల్లో ఉన్న వాటిని లాక్కొని అదానీకి ఇవ్వాలని తమకు లేదన్నారు. అదే బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి ఉన్న తేడా అని గుర్తు చేశారు. 
 
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తరపున పూర్వ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరు గ్యారెంటీలు ఇచ్చారని గుర్తు చేశారు. వాటిని క్రమంగా అమలు చేస్తున్నామన్నారు. తాను ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్యాన్ని తిరిగి పునరుద్ధరిస్తామని ప్రజలు హామీ ఇచ్చానన్నారు. అందుకే కేసీఆర్ మూసేసిన ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌ను తాను తెరిచానని చెప్పారు. భారత రాష్ట్ర సమితి నేతలు కేటీఆర్, హరీశ్ రావులు కూడా అక్కడకు వచ్చి ధర్నా చేసేందుకు అవకాశం ఇచ్చామని గుర్తు చేశారు.