బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 12 నవంబరు 2024 (12:11 IST)

ఢిల్లీలో కేటీఆర్.. సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోండి.. ప్లీజ్

ktrao
తెలంగాణలో అమృత్ పథకం అవినీతిపై కేంద్రానికి బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఫిర్యాదు చేశారు. మంగళవారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మనోహర్ లాల్ కట్టర్‌ను కలిసిన కేటీఆర్.. ముఖ్యమంత్రిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. 
 
అనంతరం కేటీఆర్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ...  కాంగ్రెస్ అధికారంలో వున్న తెలంగాణలో అధికార దుర్వినియోగం జరుగుతుందన్నారు. రాహుల్ గాంధీ క్రోనీ క్యాపటలిజం, అవినీతి గురించి మాట్లాడుతున్నారని.. కొందరు పారిశ్రామికవేత్తలు అధికారవర్గానికి దగ్గరగా ఉండి లక్షల కోట్లు కొల్లగొడుతున్నారని ఆరోపిస్తున్నారు. 
 
కాగా.. అధికార దుర్వినియోగం, అవినీతి నిరోధక చట్టాలను ఉపయోగించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రిని కేటీఆర్ కోరారు. అర్హత లేకపోయినా సీఎం బావమరిది శోధా కంపెనీకి రూ. 1,137 కోట్ల పనులు అప్పగించారని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి ఫిర్యాదు చేశారు.