గురువారం, 14 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 నవంబరు 2024 (08:36 IST)

ఏపీ డిప్యూటీ స్పీకరుగా ఆర్ఆర్ఆర్? ఇకపై జగన్‌ అసెంబ్లీలోకి అడుగపెట్టడం కష్టమేనా?

raghurama krishnamraju
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉప సభాపతిగా వైకాపా మాజీ మంత్రి, ప్రస్తుత ఉండి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే ఆర్. రఘురామకృష్ణం రాజు ఎంపికకానున్నారు. ఈ మేరకు ఆయన పేరును టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు ఎంపిక చేసినట్టు సమాచారం. ఈ ఉప సభాపతి ఎంపికకు సంబంధించి నోటిఫికేషన్ నేడు లేదా రేపు వెల్లడయ్యే అవకాశం ఉంది. పైగా,  ఈ పదవికీ ఎవరూ నామినేషన్ దాఖలు చేసే అవకాశం లేదు. దీంతో ఉప సభాపతిగా ఆర్ఆర్ఆర్‌ను ఏకగ్రీవంగా ఎంచుకోవడం లాంఛనమేకానుంది. 
 
ఉప సభాపతి కోసం మంగళవారం సీఎం చంద్రబాబు నాయుడు అనేక మంది పేర్లను పరిశీలించారు. చివరకు ఆర్ఆర్ఆర్ వైపే ఆయన మొగ్గు చూపారు. బుధ, గురువారాల్లో డిప్యూటీ స్పకర్ పదవికి నోటిఫికేషన్ విడుదలకానుంది. మరెవరూ నామినేషన్ దాఖలు చేయకపోతే కూటమి ఎమ్మెల్యేు ఆయనను ఉప సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. ఫలితంగా ఆర్ఆర్ఆర్ ఎన్నిక లాంఛనమేకానుంది. 
 
ఇక తాజా ఎన్నికల్లో ఆయన వెస్ట్ గోదావరి జిల్లా ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచిన విషయం తెల్సిందే. గత 2019లో జరిగిన ఎన్నికల్లో ఆయన నరసాపురం లోక్‌సభ నుంచి వైకాపా తరపున గెలిచారు. ఆ తర్వాత ఆ పార్టీ అధినేత జగన్‌తో ప్రత్యక్ష యుద్ధానికి దిగి ఆ పార్టీకి రాజీనామా చేశారు. 
 
కాగా, ఉప సభాపతిగా ఆర్ఆర్ఆర్ పేరును చంద్రబాబు వ్యూహాత్మకంగానే ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే అసెంబ్లీకి రావడం లేదు. గత ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమైనా ప్రతిపక్ష హోదా కావాలంటూ పట్టుబడుతున్నారు. అది సాధ్యంకాదు. దీంతో ఆయన అసెంబ్లీకి రావడం లేదు. ఈ క్రమంలో జగన్‌ను శాశ్వతంగా అసెంబ్లీలో అడుగుపెట్టనీయంగా చేసేందుకే ఆర్ఆర్ఆర్ పేరును ఉప సభాపతిగా ఎంపిక చేసినట్టు తెలుస్తుంది.