సంబంధిత వార్తలు
- తమిళనాడులో "నీట్" మరణాలు... మరో ముగ్గురు విద్యార్థులు..
- కేంద్ర పారామిలటరీకే పరిమితం.. ఇక రాష్ట్ర పోలీస్ పిల్లలకూ ఉపకారవేతనం పెంపు
- గమ్యస్థానానికి ఆలస్యంగా చేరిన రైలు... నీట్ పరీక్షకు దూరమైన విద్యార్థులు
- భారత అంతరిక్ష చరిత్రలో మరో అద్భుతమైన ఘట్టం... ఆదిత్య-ఎల్1తో సూర్యుడిపై ప్రయోగం...
- వాటిని ఇడియట్స్ మాత్రమే అంగీకరిస్తారు... లక్ష్మీనారాయణ స్ట్రాంగ్ కౌంటర్
నీట్ అర్హులకు రూ.లక్షల్లో ఉపకారవేతనం..
జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)లో అర్హత సాధించిన అభ్యర్థులకు లక్షల్లో ఉపకారవేతనం ఇచ్చేందుకు అమెరికాలో టిక్సాలా విశ్వవిద్యాలయం ముందుకు వచ్చింది. నిజానికి దేశంలోని వైద్య విద్యా కోర్సుల్లో చేరేందుకు ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. అయితే, నీట్‌లో అర్హత సాధించినప్పటికీ.. కొందరికీ వైద్య సీట్లు లభించడం లేదు.
ఇలాంటి విద్యార్థులకు అండగా నిలబడేందుకు టెక్సిలా యూనివర్శిటీ ముందుకు వచ్చింది. టెక్సిలా అమెరికన్ యూనివర్సిటీ (టీఏయూ) ముందుకొచ్చింది. ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు పరిమితంగా ఉన్న కారణంగా ఎంబీబీఎస్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నవారికి తమ యూనివర్సిటీలో వైద్య విద్యను అభ్యసించే అవకాశం కల్పిస్తామని తెలిపింది.
పైగా, ప్రతి విద్యార్థికీ రూ.20 లక్షల స్కాలర్‌షిప్ కూడా అందించనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. తమ వర్సిటీలో 40 దేశాల విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నట్లు వెల్లడించింది. మార్చి, సెప్టెంబరులలో తాము అడ్మిషన్లు కల్పిస్తున్నట్లు, ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (ఎఫ్‌ఎంజీఈ)లో సైతం శిక్షణ అందిస్తున్నట్లు వివరించింది.
