శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 10 ఆగస్టు 2019 (20:25 IST)

భారత అంతరిక్ష చరిత్రలో మరో అద్భుతమైన ఘట్టం... ఆదిత్య-ఎల్1తో సూర్యుడిపై ప్రయోగం...

భారత అంతరిక్ష చరిత్రలో మరో అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. జాబిల్లిపై పరిశోధనల కోసం చంద్రయాన్‌ 2 ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శ్రీహరికోట నుంచి విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే. తాజాగా భారత్ ఇప్పుడు అమెరికా అంతరిక్ష పరిశోదన సంస్థ నాసాతో కలసి మరో అద్బుత ప్రయోగానికి శ్రీకారం చుట్టనుంది. 
 
ఇందులో ఇస్రో, నాసాలు కలిసి సూర్యుడిపై సరికొత్త పరిశోధనలకు సిద్ధం అవుతున్నాయి. ఇస్రో, నాసాలు సూర్యుడిపై పరిశోధనలకు ఆదిత్య–ఎల్‌1 ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సన్నాహాలు మొదలుపెడుతున్నాయి. 2018లో ఇస్రో-నాసాలు మధ్య పూర్తిస్థాయి చర్చలు జరిపిన నేపథ్యంలో ఓ సరికొత్త ప్రయోగానికి రెడీ అవుతున్నాయి.
 
అమెరికా ఇటీవలే సూర్యుడిపై పరిశోధనలకు సోలార్‌ ప్రోబ్‌ అనే ప్రయోగాన్ని చేపట్టింది. శ్రీహరికోట రాకెట్‌ కేంద్రం నుంచి పీఎస్‌ఎల్‌వీ–ఎక్స్‌ఎల్‌ రాకెట్‌ ద్వారా ఆదిత్య–ఎల్‌1 ఉపగ్రహాన్ని పంపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. దీనికి భారత ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో హ్యూమన్‌ స్పేస్‌ ప్రోగ్రాం ముందుగానే ప్రయోగించే అవకాశముంటుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెపుతున్నారు. 
 
ఉపగ్రహాన్ని భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాగ్రేంజియన్‌ బిందువు–1 లోకి చేరవేస్తారు. అక్కడి నుంచి ఎలాంటి అడ్డంకుల్లేకుండా సూర్యుడిని నిత్యం పరిశీలించడం వీలవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. లాంగ్రేంజియన్ బిందువు దగ్గర దాదాపు పన్నెండు లక్షల డిగ్రీల కెల్విన్‌ ఉష్ణోగ్రత ఉంటుంది.

సూర్యుడి అంతర్భాగంలో ఆరు వేల డిగ్రీల కెల్విన్‌ ఉష్ణోగ్రత ఉంటుంది. కరోనాలో వేడి పెరిగిపోతుండడానికి కారణం అంతుచిక్కడం లేదు. ఈ అంశంపై ఆదిత్య–ఎల్‌1తో పరిశోధనలు చేస్తారు. అన్నీ సమకూరితే 2020 ఆఖరులోపు ఈ ప్రయోగాన్ని నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నామని ఇస్రో శాస్త్రవేత్తలు తెలయజేశారు.