శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 10 ఆగస్టు 2019 (18:42 IST)

వాటిని ఇడియట్స్ మాత్రమే అంగీకరిస్తారు... లక్ష్మీనారాయణ స్ట్రాంగ్ కౌంటర్

ఏపీ ఎన్నికలకు ముందు జనసేనలో చేరిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల తరువాత లక్ష్మీనారాయణ పార్టీకి దూరంగా ఉండటంతో, ఆయన పార్టీని వీడుతున్నట్టు కొంతకాలంగా ఊహాగానాలు మొదలయ్యాయి. 
 
తాజాగా ఆయన తన సన్నిహితుడు గంపల గిరిధర్‌తో కలిసి బీజేపీలో చేరబోతున్నట్టు ప్రచారం మొదలైంది. దీనిపై స్పందించిన లక్ష్మీనారాయణ... తాను పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
 
అలాగే జనసేన నుంచి వీడనున్నట్లు వస్తున్న వార్తలపై ఆ పార్టీ నేత లక్ష్మీనారాయణ స్పందించారు. ఇలాంటి వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. కొందరు కావాలనే ఇలాంటి వార్తలను స్ప్రెడ్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ వార్తలను అంగీకరించేవారు ఇడియట్స్ మాత్రమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన వల్ల పార్టీకి ఉపయోగం ఉంటుందని భావించినన్ని రోజులు తాను పార్టీలోనే ఉంటానని లక్ష్మీనారాయణ వెల్లడించారు. ఇలాంటి వార్తలను పెద్దగా పట్టించుకోనని, సమయాన్ని వృధా చేసుకోనని తేల్చి చెప్పారు.