శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By మోహన్
Last Updated : శనివారం, 1 జూన్ 2019 (11:37 IST)

కేంద్ర పారామిలటరీకే పరిమితం.. ఇక రాష్ట్ర పోలీస్ పిల్లలకూ ఉపకారవేతనం పెంపు

కేంద్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. రెండో సారి భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ తన ప్రమాణ స్వీకారం తర్వాత కొత్తగా కొలువు దీరిన కేంద్ర మంత్రులతో తొలిసారి సమావేశం నిర్వహించారు.

భారత రక్షణ నిధి ద్వారా ఉపకార వేతనాలు ఇచ్చే కార్యక్రమంపై సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. బాలురకు ఇప్పటి వరకు ఉన్న ఉపకార వేతనం రూ. 2 వేల నుంచి రూ.2500లకు పెంచారు. 
 
బాలికలకు రూ.2250 నుంచి రూ.3000లకు పెంచారు. ఇప్పటి వరకు కేంద్ర పారామిలటరీ బలగాలకు మాత్రమే ఉన్న ఉపకార వేతనాలు రాష్ట్రాలకూ విస్తరించారు. రాష్ట్ర పోలీసు విభాగానికి కూడా ఉపకారవేతనాలు వర్తించేలా కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఏడాదికి రాష్ట్రం నుంచి 500 మంది రాష్ట్ర పోలీసు విభాగం పిల్లలను ఎంపిక చేసి వారికి ఉపకార వేతనాలు అందిస్తారు. వీటన్నింటికి కేంద్ర హోంశాఖ నోడల్ మంత్రిత్వ శాఖగా ఉండనుంది.