బాపూను అవమానించిన ప్రజ్ఞా సింగ్‌ను క్షమించేది లేదు: మోదీ
భారత జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సే దేశభక్తుడంటూ కామెంట్ చేసిన బీజేపీ నేత ప్రజ్ఞా సింగ్ థాకూర్‌ను క్షమించే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ అన్నారు.
బాపూను అవమానించిన ప్రజ్ఞను తాను ఎప్పటికీ క్షమించనన్నారు. అయితే ఆమె మాత్రం ప్రస్తుతం భోపాల్ నుంచి బీజేపీ అభ్యర్థిగానే పోటీ చేస్తున్నారు. ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
అంతకుముందు మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ సభలో మోదీ ప్రసంగించారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, కచ్ నుంచి కామ్‌రూప్ వరకు అందరూ బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. ఆబ్ కీ బార్.. 300 పార్ అని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారని తెలిపారు.