గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 12 మే 2019 (18:07 IST)

ఉగ్రవాదులపై కాల్పులు జరిపేందుకు ఈసీ అనుమతి తీసుకోవాలా?

ఉగ్రవాదులపై కాల్పులు జరపడానికి కూడా సైన్యం ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవాలా?.. ఉగ్రవాదులు బాంబులు, గన్స్‌ చేత పట్టుకుని ఎదుట నిలుచుంటే.. జవాన్లు ఈసీ వద్దకు పరిగెత్తి అనుమతి తీసుకోవాలా? అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశ్నించారు.


తాను కాశ్మీర్‌కు వచ్చాక.. ప్రతీ రెండు, మూడు రోజులకు ఒకసారి ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. ఇది తన క్లీప్ ఆప్ ఆపరేషన్ అని మోదీ వ్యాఖ్యానించారు. 
 
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నేటితో ఆరు విడతల పోలింగ్ ముగియనుంది. చివరి దశ అయిన ఏడో విడత ఎన్నికలకు ఈ నెల 19న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకోవడంతో అధికార-ప్రతిపక్షాల మధ్య విమర్శల పదును పెరుగుతోంది. 
 
తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ.. ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా.. సైనికులు ఉగ్రవాదులపై కాల్పులు జరపడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ప్రతిపక్షాల తీరును ఆయన ఖండించారు.
 
కాగా... షోఫియన్ జిల్లాలోని హింద్‌సితాపూర్ ప్రాంతంలో సైన్యం కార్డెన్ సెర్చ్ నిర్వహించింది. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడగా.. భద్రతా బలగాలు తిప్పికొట్టాయి. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. 
 
ఇదిలా ఉంటే, సైన్యం విషయాలను రాజకీయం చేయడంపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని మోదీ పదేపదే తన రాజకీయ ప్రసంగాల్లో సైన్యం ప్రస్తావన తీసుకువస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.