శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 వార్తలు
Written By
Last Updated : సోమవారం, 29 ఏప్రియల్ 2019 (17:11 IST)

'నేను తలచుకుంటే మమతా సర్కార్ మటాష్' : నరేంద్ర మోడీ వార్నింగ్

వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వార్నింగ్ ఇచ్చారు. తాను తలచుకుంటే దీదీ సర్కారు కుప్పకూలిపోతుందన్నారు. తనతో టీఎంసీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ బాంబు పేల్చారు. పైగా, మే 23వ తేదీన లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణం... రాష్ట్రంలోని టీఎంసీ ఎమ్మెల్యేలంతా ఆ పార్టీ వదిలి బీజేపీలోకి వస్తారంటూ సంచలన ప్రకటన చేశారు. 
 
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమవారం బెంగాల్‌లోని సారంపూర్‌లో సోమవారం జరిగిన ఓ ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ... 'దీదీ, మే 23వ తేదీన ఫలితాలు వెలువడే రోజు ప్రతిచోటా కమలం వికసిస్తుంది. మీ ఎమ్మెల్యేలు మిమ్మల్ని వదిలేస్తారు. ఇవాళ కూడా 40 మంది మీ ఎమ్మెల్యేలు నాతో మాట్లాడారు' అని వ్యాఖ్యానించారు. 
 
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో నాలుగో దశ ఎన్నికల పోలింగ్ సోమవారం ముగిసింది. ఈ పోలింగ్‌లో భాగంగా వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా, అధికార టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ తర్వాత నరేంద్ర మోడీ సీఎం మమతా బెనర్జీకి వార్నింగ్ ఇవ్వడం ఇపుడు రాజకీయకంగా కలకలం రేపింది. 
 
ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలకు సీఎం మమతా బెనర్జీ ధీటుగా స్పందించారు. కేంద్ర బగాలను వాడుకుని బీజేపీకి ఓట్లు వేయించే ప్రయత్నం చేస్తున్నారంటూ మోడీపై ఆరోపణలు గుప్పించారు. ముఖ్యంగా బెగాల్‌పై మోడీ కక్ష కట్టారని మమతా బెనర్జీ ఆరోపించారు.