నా ఇంట్లో కూడా ఐటీ సోదాలు చేయొచ్చు : నరేంద్ర మోడీ
దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేయడాన్ని విపక్ష పార్టీలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ముఖ్యంగా, బీజేపీ పాలితేతర రాష్ట్రాల్లోనే ఈ సోదాలు జరుగుతున్నాయి. వీటిపై విపక్ష పార్టీల నేతలు ఆగ్రహం చేస్తున్నాయి.
ఈ దాడులపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఒకవేళ తానేమైనా తప్పు చేస్తే, ఆదాయం పన్ను శాఖ అధికారులు నా ఇంట్లోనూ దాడులు చేయాలని కోరారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులు చేస్తున్న దాడులపై ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయన్నారు. రాజకీయ కక్షతో నేతల ఇళ్లపై ఐటీ దాడులు జరగడం లేదని, చట్టం ప్రకారమే ఆ సోదాలు జరుగుతున్నాయని తెలిపారు.
కరెంటు బిల్లులను తగ్గిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ .. చివరకు కరెంటు సరఫరానే తగ్గించిందని విమర్శించారు. మధ్యప్రదేశ్‌లో గత ప్రభుత్వం కన్నా కాంగ్రెస్ పార్టీ తక్కువ విద్యుత్తును సరఫరా చేస్తోందన్నారు. కాగా, వారణాసి నుంచి పోటీ చేస్తున్న నరేంద్ర మోడీ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు.