శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 వార్తలు
Written By
Last Updated : గురువారం, 9 మే 2019 (16:35 IST)

ప్రధాని నరేంద్ర మోడీ పరీక్షల్లో ఫెయిలైన ఓ విద్యార్థి : ప్రియాంకా

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థి తరహాలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతున్నారని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రియాంక గాంధీ, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌తో కలిసి రోడ్ షో చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మోడీతో పాటు.. బీజేపీ నేతలపై విమర్శనాస్త్రాలు సంధించారు. 
 
మోడీని టీచర్ ఎందుకు హోమ్‌వర్క్ చేయలేదని అడిగితే… దివంగత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తన జవాబు పత్రం తీసుకున్నారని, ఇందిరా గాంధీ తన నోట్‌బుక్‌లో పేపర్లను చింపేశారని చెబుతున్నట్లుగా మోడీ పరిపాలన సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా మోడీకి ప్రియాంకా ఓ సవాల్ విసిరారు. గత ఐదేళ్ళలో నోట్లరద్దు, జిఎస్‌టి, మహిళ భద్రతపై మోడీ ఏం చేశారని ప్రియాంక నిలదీశారు.