ఆరేళ్ళ చిన్నారికి చాక్లెట్ చూపించి.. రేప్ చేయబోయిన 65యేళ్ళ వృద్థుడు..

జె| Last Modified ఆదివారం, 11 ఆగస్టు 2019 (11:37 IST)
రాష్ట్రంలో ఎటు చూసినా నానాటికీ చిన్నారులపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. అభంశుభం తెలియని చిన్నారులపై పైశాచానికి పాల్పడుతున్నారు కామాంధులు. తొమ్మిది నెలల పసిపాపపై అత్యాచారానికి పాల్పడిన యువకుడికి ఉరిశిక్ష పడిన రోజే చిత్తూరు జిల్లా వి.కోటలో మరో దారుణం చోటుచేసుకుంది.

చిత్తూరుజిల్లా వి.కోట మండలం బంగలూరులో ఆరేళ్ళ బాలికపై అత్యాచారానికి ప్రయత్నించాడు 65 యేళ్ళ వృద్థుడు. గతంలో కూడా ముగ్గురు చిన్నారులపై ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డాడు గోవిందప్ప. అప్పుడు గ్రామంలో పెద్ద మనుషులు సర్ధుబాటు చేశారు. కానీ మళ్ళీ ఒక ఆరేళ్ళ చిన్నారిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు.

ఇంట్లో తల్లిదండ్రులు బయటకు వెళ్ళిన సమయంలో వృద్థుడు ఇంట్లోకి వెళ్ళి చాక్కెట్ చూపించి అఘాయిత్యానికి యత్నించాడు. అయితే ఉన్నట్లుండి తల్లిదండ్రులు ఇంటికి వచ్చి చూడడంతో గోవిందప్ప వ్యవహారం బయటపడింది. స్థానికులు గోవిందప్పకు దేహశుద్థి చేసి పోలీసులకు అప్పగించారు.దీనిపై మరింత చదవండి :