శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: సోమవారం, 4 జనవరి 2021 (18:06 IST)

కేశినేని శ్వేత చేతులు మీదుగా విద్యార్థులకు ఉపకార వేతనాలు

ఉపకార వేతనాలతో చదువుకున్న విద్యార్థులు భవిష్యత్తులో మరొకరికి సాయం చేయాలని కేశినేని శ్వేత అన్నారు. భారత మహిళా మండలి చైర్మన్ అరుణ బోస్ అధ్యక్షతన మహిళా మండలి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో విజయవాడకు చెందిన 15 మంది పేద విద్యార్థులకు ఉపకార వేతనాలను, 10 మంది పేదవారికి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.1,75000/-లను కేశినేని శ్వేత గారి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు.
 
ఈ సందర్భంగా కేశినేని శ్వేత మాట్లాడుతూ... విద్య ద్వారానే పేదరికాన్ని అధిగమించి ఉన్నతస్థాయికి చేరుకోవచ్చని తెలిపారు. సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తులు, సంస్థలు విద్యార్థులకు సాయం అందించేందుకు ముందుకు రావాలని కోరారు.
 
కులమతాలకు అతీతంగా పేద విద్యార్థులకు సాయం చేయాలన్న లక్ష్యం, పేదలకు వైద్య ఖర్చులు ఇవ్వడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండలి మాజీ చైర్మన్ అన్నపూర్ణ గారు, విజయశ్రీ గుప్తా గారు, అష్టాలక్ష్మి గారు, సాయి లక్ష్మీ గారు, పద్మజ గారు, సువర్ణ గారు పాల్గొన్నారు.