సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 6 ఆగస్టు 2019 (11:18 IST)

హాస్టల్‌లో అమానుషం.. గొంతుకోసి విద్యార్థి హత్య...

కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. చల్లపల్లి బీసీ హాస్టల్‌లో మూడో తరగతి చదివే విద్యార్థిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. బాత్రూమ్‌లో గొంతుకోసి హత్య చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
చర్లపల్లి నారాయణనగర్‌కు చెందిన ఆదిత్య అన్న కూడా ఇదే హాస్టల్‌లో ఉంటున్నాడు. రోజు అన్న పక్కనే పడుకునే ఆదిత్య సోమవారం రాత్రి అతని గదికి రాలేదు. దీంతో పక్క గదిలో ఉండొచ్చని ఆదిత్య అన్న భావించాడు. అయితే, మంగళవారం కూడా అతను రాలేదు. దీంతో అక్కడకు వెళ్లి చూసేసరికి ఆదిత్య బాత్రూంలో రక్తపు మడుగులో పడి ఉన్నాడు. 
 
తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు హాస్టల్‌కు చేరుకొని కన్నీరుమున్నీరవుతున్నారు. గొంతు కింద కోసి ఉండడంతో ఆదిత్యను ఎవరో హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. హాస్టల్‌ వార్డెన్‌తో పాటు తోటి విద్యార్థులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.