శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 28 జనవరి 2019 (14:46 IST)

తెలంగాణ పంచాయతీ పోల్ : కుటుంబమంతా గెలిచింది.. ఎలా?

తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో భాగంగా, అసిఫాబాద్ జిల్లా కౌటల మండలం బోధంపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓ కుటుంబంలోని సభ్యులంతా గెలుపొందారు. ఈ కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు పోటీ చేయగా, వారంతా విజయం సాధించారు. 
 
ఈ పంచాయతీ ఎన్నికల్లో గ్రామ సర్పంచి పదవి, ఉప సర్పంచి పదవి, ముగ్గురు వార్డు మెంబర్లుగా పోటీ చేసి గెలుపొందారు. దీనికి కారణం ఈ గ్రామ పంచాయతీ ఎస్టీ రిజర్వుడు కావడంతో ఈ కుటుంబంలోని సభ్యులంతా పోటీ చేసే పరిస్థితి ఏర్పడింది. 
 
ఈ ఎన్నికల్లో గ్రామ సర్పంచ్‌గా రెడ్డి శంకర్ గెలుపొందగా, ఉప సర్పంచ్‌గా అతని రెడ్డి కమల, వార్డు మెంబర్లుగా శంకర్ అన్న భీమయ్య ఐదో వార్డులో, భీమయ్య భార్య సుశీల ఆరో వార్డులో, శంకర్ - భీమయ్యల తల్లి దుర్గమ్మ ఒకటో వార్డులో పోటీ చేసి గెలుపొందారు. ఒకే ఫ్యామిలీ నుంచి ఏకంగా ఐదుగురు గెలుపొందడంతో ఈ కుటుంబాన్ని పవర్‌ఫుల్ ఫ్యామిలీగా స్థానికులు పేర్కొంటున్నారు.