శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 23 డిశెంబరు 2019 (17:54 IST)

కేసీఆర్, కేటీఆర్‌లను పొగుడుతున్న టీడీపీ ఫ్యాన్స్.. జగన్‌ను మాత్రం?

ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఫ్యాన్స్ ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్‌ని పొగుడుతున్నారు. తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబుని విమర్శించి ఉండవచ్చు. కానీ బాబు ప్రవేశ పెట్టిన కొన్ని విప్లవాత్మక మార్పులను మాత్రం తెరాస రద్దు చేయలేదు. హైటెక్ సిటి మీద విమర్శలు చేశారే కానీ హైటెక్స్ కమాన్‌కి తెరాస రంగు వేయలేదు. అలాగే డ్వాక్రా సంఘాలను కూడా పెద్దగా కేసీఆర్ ఇబ్బంది పెట్టలేదు.
 
మీసేవ, ఈసేవ వంటి వాటిని రద్దు చెయ్యాలి అనే ఆలోచన చేయలేదు. చంద్రబాబు కట్టిన ఓ భవనాన్ని ఆపే ప్రయత్నం అనేది ఎక్కడా చేయలేదు. రాజకీయాలను రాజకీయాల వరకే కేటిఆర్, కేసీఆర్ చూసారు, చంద్రబాబు ప్రవేశపెట్టిన కార్యక్రమాలను పొగిడారు. 
 
అయితే ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత వైకాపా చీఫ్, సీఎం జగన్ మాత్రం చంద్రబాబు గుర్తులు లేకుండా చేసే ప్రయత్నం ఎక్కువగా చేసారు. దీనిపై తెలుగుదేశం ఫ్యాన్స్ ఆగ్రహంగా వున్నారు. పక్క రాష్ట్రం వాళ్ళు చంద్రబాబుని గౌరవిస్తే, జగన్ కనీసం అది కూడా చేయడం లేదని, కేటిఆర్ ఉన్నతంగా ఆలోచించే వ్యక్తి అంటూ కొనియాడుతున్నారు.