ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ttdj
Last Updated : సోమవారం, 9 మే 2016 (18:25 IST)

మే 12న కాకర్లలో త్యాగరాజస్వామి జయంతి మహోత్సవం: తితిదే

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తెలుగు వాగ్గేయకార చక్రవర్తి శ్రీ త్యాగరాజస్వామివారి 249వ జయంతి మహోత్సవాన్ని తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో మే 12వతేదీ గురువారం కాకర్తలో తితిదే ఘనంగా నిర్వహించనుంది. ధర్మప్రచారంలో భాగంగగా ప్రముఖ వాగ్గేయకారుల జయంతి, వర్ధంతి మహోత్సవాలను తితిదే నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
 
తితిదే ప్రకాశం జిల్లా కాకర్లలోని తితిదే ధ్యాన మందిరం వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 8గంటల నుంచి 9వరకు కళాకారులు గ్రామ సంకీర్తన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 9గంటల నుంచి 11గంటల వరకు శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతల వారికి, సద్గురు శ్రీ త్యాగరాజస్వామివారి ఉత్సవ విగ్రహాలకు పంచమృతాభిషేకం ఘనంగా నిర్వహించనున్నారు. 
 
అనంతం ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు శ్రీ త్యాగరాజ విరచిత ఉత్సవ సాంప్రదాయ కీర్తనలు, దివ్యనామ సంకీర్తనలు, అపూర్త కృతుల సంకీర్తనార్చన కార్యక్రమం నిర్వహించనున్నారు. సాయంత్రం 5.30గంటల నుంచి 6.30వరకు ప్రముఖ సంగగీత విద్యాంసులు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, ఎస్వీ సంగీత నృత్య కళాశాల అధ్యాపకులతో శ్రీ త్యాగరాజస్వామివారి పంచరత్న కీర్తనలు ఆలపించనున్నారు. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 వరకు శ్రీవారి కళ్యాణం వైభవంగా నిర్వహించనుంది తితిదే.