బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 21 మే 2021 (11:14 IST)

ఈ నెల 26న ట్రేడ్ యూనియన్ల నిరసన

మోదీ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ నెల 26న నిరసన చేపట్టాలని దేశంలోని పది ప్రధాన ట్రేడ్​ యూనియన్లు నిర్ణయించాయి.
 
- ఉచిత వ్యాక్సినేషన్​, నూతన సాగు చట్టాల రద్దు వంటివి యూనియన్ల ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి. 'బ్లాక్​ డే ఫర్ ఇండిన్​ డెమొక్రసీ' పేరుతో నిరసన చేపట్టాలని దేశంలోని పది ట్రడ్ యూనియన్ల ఐక్య వేదిక నిర్ణయించింది.  నల్ల బ్యాడ్జీలు ధరించి, నల్ల జెండాలతో ఈ నెల 26 ప్రభుత్వానికి తమ నిరసన గళం వినిపించనున్నట్లు తెలిపాయి.
 
 
డిమాండ్లు..
- అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్.
- పేదలకు ఉచిత రేషన్​, నెలవారీ ఖర్చులకు రూ.7,500 నగదు.
- మూడు నూతన సాగు చట్టాల రద్దు, పట్టకు కనీస మద్దతు ధర.
- గత ఏడాది పార్లమెంట్​లో ఆమోదం పొందిన నూతన కార్మిక చట్టాల ఉపసంహరణ.
- మోదీ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని, తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం చేస్తామని యూనియన్లు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి.
 
సమ్మెకు పిలుపునిచ్చిన ట్రేడ్​ యూనియన్లు..
- నేషనల్​ ట్రేడర్​ యూనియన్ కాంగ్రెస్​ (ఐఎన్​టీయూసీ), ఆల్​ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్​ (ఏఐటీయూసీ), హింద్​ మజ్దూర్​ సభా (హెచ్​ఎంఎస్​), సెంటర్ ఆఫ్​ ఇండియన్ యూనియన్​ (సీఐటీయూ), ఆల్​ ఇండియా యూనైటెడ్​ ట్రేడ్​ యూనియన్​ సెంటర్​ (ఏఐయూటీయూసీ), ట్రేడ్​ యూనియన్​ కో-ఆర్డినేషన్​ సెంటర్ (టీయూసీసీ), సెల్ఫ్​​ ఎంప్లాయిడ్​ ఉమెన్స్​ అసోసియేషన్​ (సెవా), ఆల్​ ఇండియా కౌన్సిల్ ఆఫ్​ ట్రేడ్ యూనియన్స్​ (ఏఐసీసీటీయూ), లేబర్ ప్రోగ్రెసివ్ ఫెడరేషన్ (ఎల్​పీఎఫ్​), యునైటెడ్​ ట్రేడ్​ యూనియన్​ కాంగ్రెస్​ (యూటీయూసీ) నిరసనల్లో పాల్గొననున్నాయి.