శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 2 డిశెంబరు 2016 (21:25 IST)

తుమ్మలపల్లి కళాక్షేత్రంలో డిసెంబర్ 3న త్రివేణు యాత్ర మురళీ గానం

జాతీయంగా, అంతర్జాతీయంగా విశిష్ట ఖ్యాతి పొందిన ముగ్గురు మురళీ గాన విద్వాంసులతో (ఫ్లూట్) డిసెంబర్ 3, విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ‘త్రివేణు యాత్ర’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ‘త్రివేణు’ కార్యక్రమం ఒక విశిష్టమైనది. ఈ కార్యక్రమంలో ముగ్గురు

జాతీయంగా, అంతర్జాతీయంగా విశిష్ట ఖ్యాతి పొందిన ముగ్గురు మురళీ గాన విద్వాంసులతో (ఫ్లూట్) డిసెంబర్ 3, విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ‘త్రివేణు యాత్ర’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ‘త్రివేణు’ కార్యక్రమం ఒక విశిష్టమైనది. ఈ కార్యక్రమంలో ముగ్గురు మురళీగాన విద్వాంసులు...  మూడు రకాల పద్ధతుల్లో సంప్రదాయబద్ధంగా ప్రదర్శన ఇవ్వడం గొప్ప విషయంగా చెప్పుకోవాలి. 
 
ఫ్లూట్ నాగరాజుగా విశిష్ట ఖ్యాతి పొందిన నాగరాజు తాళ్లూరి,  దక్షిణ భారతదేశ శైలిలో మరళీగానం విన్పిస్తారు. రూపక్ కులకర్ణీ ఉత్తరాది వ్యవహారికంలో, నికోలో మిలుచ్చి పాశ్చాత్య పద్ధతిలో మురళీ గానాన్ని ఆలపిస్తారు.  నాగరాజు తాళ్లూరి దేశ వ్యాప్తంగా ఎన్నో అవార్డులు, రివార్డులు గెలుచుకున్న తెలుగు తేజం. ముగ్గురి ప్రదర్శనలు పూర్తయిన తర్వాత...  ముగ్గురు ప్రదర్శించిన సంగీతాన్ని నాగరాజు తాళ్లూరి ఒక్కడే అవలీలగా ప్రదర్శిస్తారు.
  
పాశ్చాత్య సంగీతం, దేశీయ సంగీతం పరస్పరం మార్పులు, చేర్పులు చేసుకోవడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. ముగ్గురు మురళీ విద్వాంసులతోపాటు ప్రసిద్ధ సంగీత కళాకారులు పీటర్స్ రాజేష్, శ్రీనివాసన్, రాకేష్,చారి, ఫణీంద్ర, రామిందర్ సింగ్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని భాషా, సాంస్కృతి శాఖతో సంయుక్తంగా ఐవామ్ సంస్థ సమర్పిస్తోంది. ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్,  సీనియర్ ఐఏఎస్ అధికారులు ఎల్వీ సుబ్రమణ్యం, శ్రీకాంత్, వీరపాండ్యన్,  సాంస్కృతిక శాఖ డైరెక్టర్ విజయ్ భాస్కర్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. విజయవాడ, తుమ్మలపల్లి కళాక్షేత్రంలో డిసెంబర్ 3వ తేదీన సాయంత్రం ఆరున్నర గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది.