ఆదివారం, 19 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 19 జనవరి 2025 (08:04 IST)

Pawan Kalyan: జనసేన కార్యాలయంపై డ్రోన్ కలకలం.. భద్రత లోపాలపై పీకే ఫ్యాన్స్ ఆందోళన

Pawan Kalyan camp Office
Pawan Kalyan camp Office
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భద్రత విషయంలో లోపాలు వెలుగులోకి వస్తున్నాయి. సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంపై గుర్తు తెలియని డ్రోన్ చక్కర్లు కొట్టడం చర్చనీయాంశం అయ్యింది. 
 
20 నిమిషాల పాటు పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం, జనసేన రాష్ట్ర కార్యాలయం పరిసర ప్రాంతాలలో 20 నిమిషాల పాటు డ్రోన్ చక్కర్లు కొట్టినట్టు సమాచారం అందుతోంది. దీనిపై ఇప్పటికే డీజీపీకి ఫిర్యాదు చేయడం జరిగింది. లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ, మంగళగిరి డిఎస్పి మురళీకృష్ణ, సిఐలు ఎస్సైలు సిబ్బంది ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు. 
 
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయం వద్ద ఇది మొదటసారి కాదు గత 4 నెలలో ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఇటీవల పవన్ మన్యం పర్యటనలో నకిలీ ఐపీఎస్ హడావుడి చేశాడు. బుక్ ఫెస్టివల్‌లో డిప్యూటీ సీఎం పవన్ స్టాల్స్ దగ్గర వుండగా విద్యుత్‌కు అంతరాయం జరిగింది. ఇప్పుడు జనసేన కార్యాలయంపై డ్రోన్ కలకలం రేపింది. 
 
ఇంకా పవన్ కళ్యాణ్ గారికి మరింత భద్రత కట్టుదిట్టం చేయాలని పీకే ఫ్యాన్స్ కూటమి ప్రభుత్వాన్ని, హోం మంత్రి అనితను కోరుతున్నారు. ఇంకా నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ఎస్‌జీ అండ్ కౌంటర్ యాక్షన్ టీమ్‌తో ఆయనకు భద్రత పెంచాలని కోరుతున్నామని జనసేన, పీకే ఫ్యాన్స్ విజ్ఞప్తి చేస్తున్నారు.