మంగళవారం, 29 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 7 సెప్టెంబరు 2016 (13:38 IST)

చంద్రబాబుకు వెంకయ్య ఫోన్.. అర్జెంటుగా ఢిల్లీకి రావాలంటూ పిలుపు

టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు బుధవారం ఫోన్ చేశారు. అర్జెంటుగా ఢిల్లీకి రావాలంటూ కబురు పంపారు. ఏపీకి ప్రత్యేక హోదాపై గత కొన్ని రోజులుగా ఉన్న సస్పెన్స్‌క

టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు బుధవారం ఫోన్ చేశారు. అర్జెంటుగా ఢిల్లీకి రావాలంటూ కబురు పంపారు. ఏపీకి ప్రత్యేక హోదాపై గత కొన్ని రోజులుగా ఉన్న సస్పెన్స్‌కు తెరదించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా బుధవారం ఉదయం నుంచి వరుస భేటీలతో ఏపీ ఎంపీలంతా ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. 
 
ఈ పరిణామాల నేపథ్యంలోనే ఏపీ సీఎంకు హస్తిన నుంచి పిలుపొచ్చింది. కొద్దిసేపటి క్రితమే ఏపీ సీఎం చంద్రబాబుకు వెంకయ్యనాయుడు ఫోన్‌ చేసినట్లు తెలిసింది. వెంటనే బయల్దేరి ఢిల్లీకి రావాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ప్యాకేజీలోని అంశాలను చంద్రబాబుకు వివరించేందుకే వెంకయ్య ఢిల్లీకి రమ్మన్నట్లు తెలుస్తోంది.
 
మరోవైపు.. చంద్రబాబు సమక్షంలోనే ప్రకటన చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ భావించడం కూడా ఈ పిలుపుకు మరో కారణంగా చెపుతున్నారు. ఊహించిన విధంగా ప్యాకేజీ ఉంటే మధ్యాహ్నం తర్వాత ఢిల్లీకి చంద్రబాబు వెళ్లనున్నట్లు తెలిసింది. ప్రధాని కార్యాలయంలో ఏపీకి సాయంపై మంతనాలు జరపనున్నారు.