5 నెలల్లో 15 సార్లు.. కన్నకూతురిపై అత్యాచారం.. నిందితుడి అరెస్ట్
కన్నకుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ, జాలరి పేటకు చెందిన కదిరి ధనరాజు గతంలోవార్డు బాయ్‌గా పనిచేసి ప్రస్తుతం ఖాళీగా వుంటున్నాడన్నారు. అతడికి భార్య ఎల్లమ్మ, కొడు
కన్నకుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ, జాలరి పేటకు చెందిన కదిరి ధనరాజు గతంలోవార్డు బాయ్‌గా పనిచేసి ప్రస్తుతం ఖాళీగా వుంటున్నాడన్నారు. అతడికి భార్య ఎల్లమ్మ, కొడుకు (17), కుమార్తె (14) వున్నారన్నారు. భర్త ఖాళీగా ఇంటిలోనే వుండటంతో భార్యే కుటుంబ పోషణ భారం మోస్తోందన్నారు. భార్య ఇంట్లో లేని సమయంలో కుమార్తె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.
ఓ సారి కూతురు పట్ల అసభ్య ప్రవర్తనను చూసి భార్య నిర్ఘాంతపోయి అతనిని నిలదీయగా ఇద్దరి మధ్య గొడవ చెలరేగిందన్నారు. ఈ విషయం బయట పెట్టవద్దని, ఎవరికైనా చెప్పినట్లు తెలిస్తే చంపేస్తానని బెదిరించి వారి మీద చేయి చేసుకున్నాడన్నారు. దీంతో ఎల్లమ్మ తన పిల్లలతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లిపోయింది. ఐదు నెలల పాటు కనీసం 15 సార్లు కన్నకూతురిపై తన భర్త అత్యాచారానికి పాల్పడ్డాడని బంధువులకు చెప్పింది.
బంధువులతో కలిసి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో భార్య ఎల్లమ్మతో కలిసి ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని కేసు విచారణ జరుపుతున్నారు. వైద్యపరీక్షల నిమిత్తం కూతుర్ని ఆసుపత్రికి తరలించారు.