మీకు మీ పదవులకో నమస్కారం.. మాకు నిధులివ్వండి : మోడీతో చంద్రబాబు
కేంద్ర మంత్రి పదవులు ఇస్తామంటూ ముందుకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓ ఝులక్ ఇచ్చారు.
కేంద్ర మంత్రి పదవులు ఇస్తామంటూ ముందుకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓ ఝులక్ ఇచ్చారు. పదవులు తమకు అక్కర్లేదని, రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని మరోమారు విజ్ఞప్తి చేశారు. నిజానికి ప్రస్తుతం మోడీ కేబినెట్‌లో టీడీపీకి చెందిన ఎంపీలు కూడా మంత్రులుగా ఉన్నారు. వారిలో ఒకరు పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు కాగా, మరొకరు శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి.
అయితే మంగళవారం జరిగిన కేబినెట్ విస్తరణలో మంత్రి పదవులు దక్కే ఛాన్స్ పుష్కలంగా ఉన్నప్పటికీ అందుకు ససేమిరా అన్న చంద్రబాబు... అదే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీకే నేరుగా చెప్పేశారు. ఆర్థిక చిక్కుల్లో ఉన్న నవ్యాంధ్రకు సరిపడినన్ని నిధులివ్వాలని కోరిన ఆయన తమ పార్టీకి మరిన్ని మంత్రి పదవులు అవసరం లేదని తేల్చిచెప్పారు. ఆ విధంగా మంత్రి పదవులను వద్దన్న చంద్రబాబు... ఏపీకి నిధుల విషయంలో కాస్తంత ఒత్తిడి పెంచడంలో సఫలీకృతులైనట్లు సమాచారం.