గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 19 జనవరి 2024 (08:52 IST)

మేనల్లుడి నిశ్చితార్థ వేడుకలో సీఎం జగన్ - పవన్ కళ్యాణ్ రాకతో సందడే సందడి

jagan - sharmila
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తనయనడు, తన మేనల్లుడు వైఎస్ రాజారెడ్డి అట్లూరి ప్రియల నిశ్చితార్థ వేడుకకు ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తన సతీమణి భారతీ రెడ్డితో కలిసి హాజరయ్యారు. గురువారం రాత్రి హైదరాబాద్ నగరంలోని గోల్కొండ రిసార్ట్స్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ నిశ్చితార్థ కార్యక్రమానికి వచ్చిన సీఎం జగన్.. తన మేనల్లుడు రాజారెడ్డిని ఆత్మీయంగా హత్తుకుని, కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారికి వైఎస్ షర్మిల ఆత్మీయ స్వాగతం పలికారు. 
 
ఇక త్వరలోనే ఓ ఇంటివారు కాబోతున్న రాజారెడ్డి ప్రియలకు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆమె తల్లిదండ్రులకు అభివాదం చేశారు. ఈ వేడుకకు వచ్చేసిన తల్లి విజయమ్మతోనూ జగన్ కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమానికి వైకాపా అగ్రనేత వైవీ సుబ్బారెడ్డి కూడా విచ్చేశారు.
pawan - sharmila
 
అదేవిధంగా ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్ కూడా ఈ నిశ్చితార్థ వేడుకకు హాజరై త్వరలో ఒక్కటి కాబోతున్న వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత షర్మిల, బ్రదర్ అనిల్, రాజారెడ్డి, అట్లూరి ప్రియలతో కలిసి ఫోటోలు దిగారు. కాగా, పవన్ రాకతో గోల్కొండ రిసార్ట్స్‌లో ఒక్కసారిగా సందడి వాతావరణం నెలకొంది.