మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఏకాగ్రతతో యత్నం సాగిస్తారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. కొంత మొత్తం పొదుపు చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. గృహోపకరణాలు మరమ్మతుకు గురవుతాయి. ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
పరిస్థితులు అనుకూలిస్తాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కొత్త యత్నాలు మొదలెడతారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంది. ఖర్చులు సామాన్యం. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త. అనుభవజ్ఞులను సంప్రదించండి.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
తలపెట్టిన పనుల నిర్విఘ్నంగా సాగుతాయి. రావలసిన ధనం అందుతుంది. పనులు అప్పగించవద్దు. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. అయిన వారితో అవగాహన నెలకొంటుంది. పాత పరిచయస్తులు తారసపడతారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సంకల్పం సిద్ధిస్తుంది. ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ధనసహాయం తగదు. కొత్త పనులు చేపడతారు. అవకాశాలను వదులుకోవద్దు. అందరితోను మితంగా సంభాషించండి. మీ మాటలు జారవేసే వ్యక్తులున్నారు జాగ్రత్త. కీలక పత్రాలు అందుకుంటారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
సంప్రదింపులతో తీరిక ఉండదు. మీ అభిప్రాయాలను సూచనప్రాయంగా తెలియజేయండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. నగదు, ఆభరణాలు జాగ్రత్త. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలి వెళ్లకండి.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సమర్థతకు ఏమంత గుర్తింపు ఉండదు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. దంపతుల మధ్య అవగాహన లోపం. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆత్మస్థైర్యంతో మెలగండి. సన్నిహితులను కలుసుకుంటారు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. మీ కృషి ఫలిస్తుంది. ధన సమస్యలు ఎదురవుతాయి. సాయం అర్ధించేందుకు మనస్కరించదు. అలోచనలు నిలకడగా ఉండవు. నిస్తేజానికి లోనవుతారు. సన్నిహితులతో సంభాషిస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం నిరుత్సాహపరుస్తుంది. చీటికిమాటికి అసహనం చెందుతారు. ఆకస్మిక ఖర్చు ఆందోళన కలిగిస్తుంది. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. పనులు ఒక పట్టాన సాగవు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. మాటతీరుతో ఆకట్టుకుంటారు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. సోదరులను సంప్రదిస్తారు. దంపతుల మధ్య దాపరికం తగదు. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఖర్చులు అంచనాలను మించుతాయి. రావలసిన ధనం అందదు. కొత్త పనులు చేపడతారు. సంప్రదింపులు ముందుకు సాగవు. మీ శ్రీమతి ఆరోగ్యం మెరుగుపడుతుంది. బాధ్యతలు అప్పగించవద్దు. ఆప్తులను కలుసుకుంటారు. ప్రయాణం సజావుగా సాగుతుంది.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
లౌక్యంగా పనులు చక్కబెట్టుకోండి. పంతాలకు పోవద్దు. ఖర్చులు విపరీతం. దంపతుల మధ్య స్వల్ప కలహం. చీటికిమాటికి అసహనం చెందుతారు. ప్రముఖుల కలయిక వీలుపడదు. సోదరీ సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. వివాదాలు కొలిక్కివస్తాయి.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
స్థిరాస్తి ధనం అందుతుంది. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఊహించని సంఘటన ఎదురవుతుంది. సన్నిహితులను కలుసుకుంటారు. మీ భావాలకు తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి.