తోటి ఉద్యోగులు పట్టించుకోలేదు.. ఆ స్ట్రీట్ డాగ్ విశ్వాసం చూపింది (వీడియో)
ఓ మహిళా టెక్కీకి ఊహించని కష్టాలు ఎదురయ్యాయి. అనారోగ్యంతో బాధపడుతున్న తన బిడ్డ కోసం మూడు రోజుల సెలవు అడిగితే ప్రముఖ టెక్ కంపెనీ మహీంద్రా నిరాకరించింది. అంతటితో ఊరుకోని ఆ కంపెనీ.. ఆ మహిళా ఉద్యోగిని ఉద్యోగం నుంచి తొలగించింది. ఆ మహిళ పేరు భావన. తనకు జరిగిన అన్యాయాన్ని జీర్ణించుకోలేని ఆ మహీళా టెక్కీ... టెక్ కంపెనీ ఎదుట ధర్నాకు దిగారు. తనకు న్యాయం చేయాలంటూ ఆమె డిమాండ్ చేశారు.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. ఆమెను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. అయితే, అప్పటివరకు తనతో కలిసి పని చేసిన తోటి ఉద్యోగులెవ్వరూ ఆమెను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కానీ, ఓ స్ట్రీట్ డాగ్ మాత్రం ఆమె పట్ల విశ్వాసాన్ని చూపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
సాఫ్ట్ వేర్ ఉద్యోగి భావన ధర్నాకు స్ట్రీట్ డాగ్ మద్దతు
— INDIAN REPUBLIC TV (@irmediatv) July 23, 2026
HYD:అనారోగ్యంతో ఉన్న బిడ్డ కోసం మూడు రోజులు సెలవు అడిగినందుకు టెక్ మహీంద్రా కంపెనీ తనను అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించడంతో భావన కంపెనీ ఎదుట ధర్నాకు దిగారు. తనకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. పోలీసులు ఆమెను… pic.twitter.com/kkez6OxYqP
