1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. ప్రశ్నలు- సమాధానాలు
  4. Dr PA Raman astrology horoscope

సంకల్పసిద్ధి గణపతిని ఆరాధించడం వల్ల సర్వదా పురోభివృద్ధి

Dr PA Raman astrology
శ్రీకాంత్: మీరు పంచమి, శనివారం, సింహలగ్నం, ఆశ్లేష నక్షత్రం, కర్కాటక రాశి నందు జన్మించారు. సంకల్పసిద్ధి గణపతిని ఆరాధించడం వల్ల సర్వదా పురోభివృద్ధి పొందుతారు. 2016 మార్చి తదుపరి మీకు ఎటువంటి అవకాశం లభించినా సద్వినియోగం చేసుకోవడం మంచిది. మీరు బాగుగా స్థిరపడతారు.

2022 వరకూ శుక్ర మహర్దశ జరుగుతోంది. ఈ శుక్రుడు మీకు సామాన్యమైన యోగాన్ని ఇస్తాడు. 2022 నుండి రవి మహర్దశ 6 సంవత్సరములు, చంద్రుడు 10 సంవత్సరములు, కుజుడు 7 సంవత్సరములు మొత్తం 23 సంవత్సరములు మీకు బాగుగా కలిసి వస్తుంది. వ్యాపారాల పట్ల ఏకాగ్రత వహించి బాగుగా అభివృద్ధి చెందండి. ఏదైనా దేవాలయంలో బొప్పాయి చెట్టును నాటిన సర్వదా శుభం కలుగుతుంది.
 
గమనిక: మీ సందేహాలను [email protected] కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ భవిష్యవాణి ''ప్రశ్నలు-సమాధానాలు'' శీర్షికలో ప్రచురించబడుతాయి.
About Writer
Raman