2020 సంవత్సర ఫలితాలు- కుంభ రాశి వారి ఫలితాలు ఎలా వున్నాయో తెలుసా?

Last Modified: బుధవారం, 11 డిశెంబరు 2019 (14:52 IST)

కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు 
ఆదాయం : 11 వ్యయం : 5 రాజ్యపూజ్యం : 5 అవమానం : 6
 
ఈ రాశివారికి ఏలినాటి శని ప్రారంభం అవుతోంది. ఒత్తిడి, ఆందోళనలు అధికంగా వుంటాయి. శని హానికరం కాజాలడు. మూడు నెలలకు ఒకసారి శనికి తైలాభిషేకం చేయించండి ఉత్తమం. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు విపరీతం. పెట్టుబడులకు తరుణం కాదు. అవకాశాలు అందినట్టే చేజారిపోతుంటాయి. పట్టుదలతో యత్నాలు సాగించాలి.

సమర్థతకు ఆలస్యంగా గుర్తింపు లభిస్తుంది. దంపతుల మధ్య అవగాహన లోపం. బంధువులతో పట్టింపులు ఎదుర్కొంటారు. ఆత్మీయుల ప్రమేయంతో సమస్యలు సద్దుమణుగుతాయి. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. ఆరోగ్యంలో ఒడిదుడుకులు తప్పవు.

స్థలమార్పు కలిసివస్తుంది. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు ఏ పురోగతి ఉండదు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సొంత వ్యాపారాలే శ్రేయస్కరం. తరుచూ దైవకార్యాల్లో పాల్గొంటారు. 
 
ధనిష్ట నక్షత్రం వారు తెల్ల పగడం, శతభిషా నక్షత్రం వారికి గోమేధికం, పూర్వాభాద్ర నక్షత్రం వారికి వైక్రాంతమణి ధరించినట్లైతే శుభం కలుగుతుంది.


வெப்துனியா செய்திகள் உடனுக்குடன்!!! உங்கள் மொபைலில்... இங்கே க்ளிக் செய்யவும்దీనిపై మరింత చదవండి :

దీనిపై మరింత చదవండి :