శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వార్షిక ఫలం
Written By రామన్
Last Updated : బుధవారం, 11 డిశెంబరు 2019 (17:15 IST)

2020 సంవత్సర ఫలితాలు- తులారాశి వారు తైలాభిషేకం చేయించాల్సిందే

తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు 
ఆదాయం : 14  వ్యయం: 11 రాజ్యపూజ్యం: 7 అవమానం : 7
 
మిశ్రమ ఫలితాలున్నాయి. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. పదవులు, సభ్యత్వాలు దక్కవు. బంధువులతో విభేదాలు, ఆరోగ్యం భంగం. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. గృహ మార్పు తప్పదు. నిర్మాణాలు చేపడతారు. పరిచయాలు బలపడతాయి.

ఉద్యోగస్తులకు పదోన్నతి స్థానచలనం. అధికారులకు కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. వృత్తుల వారికి ఆదాయం బాగుంటుంది. వస్త్ర, పచారీ వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. పెట్టుబడులు అనుకూలించవు. భాగస్వామిక వ్యాపారాలకు తరుణం కాదు. కాంట్రాక్టులు, ఏజెన్సీ దక్కించుకుంటారు. పత్రికా రంగంలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు మధ్య సాగుతుంది. 
 
స్వాతి నక్షత్రం వారికి వైక్రాంతమణి, విశాఖ నక్షత్రం వారికి పుష్యరాగం శుభదాయకం. సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధన ఈ రాశివారికి కలిసివస్తుంది. తరుచు శివునికి అభిషేకం, శనీశ్వరునికి తైలాభిషేకం చేయించిన మనశ్శాంతి, ఆశించిన ఫలితాలు పొందుతారు.