2020 సంవత్సర ఫలితాలు- సింహరాశి వారికి అదిరిపోయే ఆదాయం

Last Modified: బుధవారం, 11 డిశెంబరు 2019 (14:45 IST)

Leo

సింహరాశి: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
ఆదాయం: 14 వ్యయం : 2 రాజ్యపూజ్యం: 1 అవమానం : 7
 
అన్ని రంగాల వారికి ఆశాజనకం. ఆదాయం బాగుంటుంది. పొదుపు పథకాలు లాభిస్తాయి. పెట్టుబడులకు అనుకూలం. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. లక్ష్య సాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. 
 
ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. గుట్టుగా యత్నాలు సాగించండి. మీ ఆలోచనలను నీరుగార్చేందుకు కొంతమంది యత్నిస్తారు. గుట్టుగా వ్యవహరించండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. 
 
ఉద్యోగస్తులకు పదవీయోగం, ఉపాధ్యాయులకు కోరుకున్న చోటికి బదిలీ. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. విదేశీయాన యత్నం ఫలిస్తుంది. తరచూ ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాల్లో పురోభివృద్ధి గడిస్తారు. వ్యాపారాల విస్తరణలకు అనుకూలం. క్రీడాకారులకు ప్రోత్సాహకరం. 
 
మఖ నక్షత్రం వారు కృష్ణ వైఢూర్యం, పుబ్బ నక్షత్రం వారు వజ్రం, ఉత్తర నక్షత్రం వారు జాతికెంపు ధరించినట్లైతే శుభం కలుగుతుంది. ఈ రాశి వారు ఆదిత్యుడిని ఆరాధించడం వల్ల సర్వదోషాలు తొలగిపోతాయి. విద్యార్థులు గురుగణపతిని మంకెన పూలతో ఆరాధించడం వల్ల విద్యాభివృద్ధి, పురోభివృద్ధి కానవస్తుంది.


வெப்துனியா செய்திகள் உடனுக்குடன்!!! உங்கள் மொபைலில்... இங்கே க்ளிக் செய்யவும்
దీనిపై మరింత చదవండి :