1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
  4. Diet plan for After maternity woman

బాలింతలకు కూరగాయల డైట్: ఆహారంతో పండ్లు, వెజిటబుల్స్ తీసుకుంటే?

Diet plan
బాలింతలు డైటింగ్ చేయాలంటే.. కూరగాయల్ని ఆహారంలో ఎక్కువ మోతాదులో తీసుకుంటే సరిపోతుందని గైనకాలజిస్టులు అంటున్నారు. ఓ బిడ్డ పుట్టిన తర్వాత మహిళలు సాధారణంగా కాస్త లావు కావడం సహజమే. కన్జూమింగ్ ఫుడ్ తీసుకోవడం ద్వారా మహిళలు ఆ సమయంలో కాస్త పుష్టిగా తయారవుతారు. కానీ శరీరాకృతి పెరిగిపోవడంపై బాలింతలు బాధపడుతూ ఉంటారు. 
 
ఇలాంటి వారు రోజు వారీ ఆహారంలో పండ్లు, కాయగూరలు తీసుకుంటే చాలునని తాజా అధ్యయనంలో తేలింది. ఈ క్రమంలో డచ్ సైంటిస్టులు జరిపిన ఓ పరిశోధనలో 80 శాతం మంది బాలింతలు కాయగూరలను తినడం ద్వారా కాల్షియం, మాగ్నీషియం వంటివి లభించి, తమ తమ శరీరాకృతి తగ్గించుకున్నారని తేలింది. 
 
అలాగే అరటి పండ్లు, పొటాటో వంటివి తీసుకోవడం ద్వారా బాలింతల శరీరాకృతి పెరిగిపోతుందని కనిపెట్టారు. అయితే పండ్లు, కాయగూరలు, అన్నం వంటి తొమ్మిది వారాల తీసుకున్న మహిళలు తమ శరీరాకృతిని తగ్గించుకున్నారని పరిశోధనలో తేలింది.
About Writer
Selvi