1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
  4. IND Vs WI, Visakha oneday, Bagging centuries each by opening batsman

IND Vs WI విశాఖ వన్డే: ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ సెంచరీలు

IND Vs WI
తొలి వన్డేలో ఓడి, సిరీస్‌ గెలుపుపై ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే గెలవక తప్పని పరిస్థితుల్లో బరిలోకి దిగిన భారత్... విశాఖలో జరుగుతున్న రెండో వన్డేలో ధాటిగా ఆడుతోంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్.. భారీ స్కోర్లతో కదం తొక్కారు. దీంతో భారత్ ప్రస్తుతం 36.1 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 220 పరుగులు చేసింది.
 
రోహిత్ 107 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సులతో 100 పరుగులు పూర్తిచేయగా, కేఎల్ రాహుల్ 102 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సులతో 101 పరుగులు చేసి సెంచరీ సాధించాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న రెండో వన్డేలో వెస్టిండీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
 
వెస్టిండీస్ తన జట్టులో రెండు మార్పులు చేసింది. ఎవిన్ లూయీస్ తిరిగి జట్టులో చేరాడు. హేడెన్ వాల్ష్ స్థానంలో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఖారీ పియెరీ తొలిసారిగా వన్డే ఆడుతున్నాడు. గత మ్యాచ్‌లో తన బౌలింగ్‌తో టీమ్ ఇండియాను ఇబ్బంది పెట్టిన వెస్టిండీస్ బౌలర్లు ఈ మ్యాచ్‌లో తేలిపోయినట్లు కనిపించారు. హోల్డర్, చేజ్‌లు తప్ప మిగిలిన వారందరినీ భారత బ్యాట్స్‌మెన్ సమర్థంగా ఎదుర్కొన్నారు.
తర్వాతి కథనం
#మూడు రాజధానులు.. బాంబు పేల్చిన జగన్మోహన్ రెడ్డి..