శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By
Last Updated : సోమవారం, 16 సెప్టెంబరు 2019 (13:07 IST)

#OzoneDay నేడు ప్రాణకోటిని రక్షించే ఓజోన్ పొర బర్త్‌డే (video)

సూర్యడు నుంచి వెలువడి అతినీల లోహిత కిరణాలు నేరుగా భూమిపై పడకుండా అడ్డుకునే పొర ఓజోన్ పొర. ఈ పొరంటూ లేకపోతే... భూమిపై ప్రాణకోటి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. అతి ప్రమాదకరమైన అతినీల లోహిత కిరణాల నుంచి జీవకోటిని రక్షించేంది ఈ ఓజోన్ పొర మాత్రమే. అలాంటి ఓజోన్ పొర పుట్టిన రోజు సెప్టెంబరు 16వ తేదీ. ప్రపంచ ఓజోన్ డేగా నిర్వహిస్తారు. 
 
అలాంటి పొరను మనిషి తీసుకునే ప్రతి నిర్ణయంతో దెబ్బతింటోంది. భూతాపం పెరిగినా, వానలు కురవకపోయినా, అడవులు తగ్గిపోయినా, కాలుష్యం ఎక్కువైనా... ఇలాంటి అనర్థాలన్నీ ఓజోన్ పొరను దెబ్బతీసేవే. పాలపై మీగడలా... ఈ ఓజోన్ అనే వాయువు... భూమి చుట్టూ ఓ పొరలా అల్లుకొని ఉంది.
 
ఇది భూమి నుంచీ స్ట్రాటో ఆవరణంలో... 15 నుంచీ 50 కిలోమీటర్ల మందంలో విస్తరించి ఉంది. సూర్యుడి నుంచీ వచ్చే అతి నీలలోహిత కిరణాలు డైరెక్టుగా భూమిపై పడనివ్వకుండా... ఓజోన్ పొర అడ్డుకుంటోంది. ఫలితంగా భగభగ మండే కిరణాలు మనపై పడకుండా ఉంటున్నాయి. 
 
ఆ పొరే గనక లేకపోతే... ఆ కిరణాలు డైరెక్టుగా భూమిపై పడి... మొత్తం ప్రాణికోటి చనిపోయేదే. అయితే, ఇపుడు భూతాపం పెరిగిపోతుండటం వల్ల ఈ ఓజోన్ పొర కరిగిపోతోంది. ఫలితంగా భూమిపై పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. 
 
ఓజోన్ పొర రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు ఓ తేదీని ఖారారు చేశారు. అదే సెప్టెంబరు 16వ తేదీ. ప్రతి యేటా సెప్టెంబరు 16వ తేదీన ఓజోన్ పొర డేగా నిర్వహిస్తారు. అయితే, ఈ పొరను దెబ్బతీసే స్ప్రేలు, పొలాల్లో చల్లుతున్న ఎరువులు, క్రిమి సంహారాలు, ఫ్రిజ్‌లు, కార్లపై వేస్తున్న కలర్స్, క్లోరో ఫ్లోరో కార్బన్ల వంటి వాటి వాడకాన్ని ఆపేయాలని 1987లోనే నిర్ణయం తీసుకున్నా... ఇప్పటికీ అది అమలవ్వట్లేదు. ఫలితంగా ఓజోన్ పొర దెబ్బతింటూనే ఉంది.