గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Modified: బుధవారం, 4 సెప్టెంబరు 2019 (21:24 IST)

పవన్ కల్యాణ్ కోసం ప్రాణమిస్తా... బన్నీ వాసును మాత్రం వదలను: సునీత(Video)

పవన్ కల్యాణ్ కోసం ప్రాణమిస్తా... బన్నీ వాసును మాత్రం వదలనంటోది జూనియర్ ఆర్టిస్టు సునీత బోయ. తనపై మీడియాలో తప్పుడు కథనాలు వస్తున్నాయనీ, వాటిని నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. తనకు మతి స్థిమితం లేదని కొంతమంది ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
 
తనను నన్ను మెగా ప్రొడ్యుసర్ బన్నీ వాసు మోసం చేశారనీ, గీతా ఆర్ట్స్ బ్యానర్లో అవకాశాలు ఇస్తానని చెప్పి ఇవ్వలేదని ఆరోపించారు. ఈ మాట అంటే దాన్ని తీస్కెళ్ళి జనసేనకు, పవన్ కళ్యాణ్‌కు లింకు పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తను జనసేనలో వీరమహిళను అనీ, ప్రాణం వున్నంతవరకూ జనసేన కోసం పని చేస్తానని చెప్పుకొచ్చారు.
 
పవన్ కల్యాణ్ కోసం ప్రాణం ఇస్తాననీ, జనసేనకు నష్టం కలిగించే పని చేయనని చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ కోసం అవసరమయితే ప్రాణత్యాగం చేస్తాను కానీ ఆయనకు నష్టం కలిగించే పని ఏదీ చేయనని అన్నారు. ఐతే తనకు బన్నీ వాసు చేసిన మోసాన్ని పవన్ కల్యాణ్ దృష్టికి జనసైనికులు తీసుకుని వెళ్లి న్యాయం చేయాలని ప్రాధేయపడ్డారు.

తనను సినిమాల్లో నటించకుండా వేరే పని చేసుకుని బతకమని అంటున్నారనీ, తను నటించడమే వృత్తిగా పెట్టుకుంటే ఇక మరే పని చేయగలనూ అంటూ తను పోస్టు చేసిన వీడియోలో ప్రశ్నించారు. చూడండి ఆ వీడియోను...